గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీ ద్వారా బాలీవుడ్ అందాల యువ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుండగా రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.
ఇటీవల దేవర నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా త్వరలో మూడవ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. విషయం ఏమిటంటే, తాజాగా అమెరికాలో ఈ మూవీ ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేయగా వెనువెంటనే 100కె డాలర్స్ ని దేవర కొల్లగొట్టింది. ఈ స్పీడ్ చూస్తే మొత్తంగా రిలీజ్ టైం కి దేవర మూవీ ప్రీమియర్స్ పరంగా పెద్ద నంబర్స్ పెట్టె అవకాశం లేకపోలేదని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు.