Home సినిమా వార్తలు Devara Pre Sales Record ప్రీ సేల్స్ లో తొలి ఇండియన్ మూవీగా ‘దేవర’ సంచలనం

Devara Pre Sales Record ప్రీ సేల్స్ లో తొలి ఇండియన్ మూవీగా ‘దేవర’ సంచలనం

devara
devara

యంగ్ టైగర్ గ్లోబల్ నటుడు ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా తాజాగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీని కొరటాల శివ తెరకెక్కిస్తుండగా విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్నారు. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.

అనిరుద్ కంపోజ్ చేసిన ఈ మూవీలోని మూడు సాంగ్స్ కి ఇప్పటికే అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. నేడు సాయంత్రం 5 గం. 4 ని. లకు దేవర థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ ఇప్పటికే నార్త్ అమెరికాలో భారీగా ప్రీ సేల్స్ జరుపుకుంటుండగా తాజాగా 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది.

ఆ విధంగా ప్రీ సేల్స్ లో తొలి ఇండియన్ మూవీగా దేవర మూవీ సంచలనం సృష్టించింది. ఇటీవల భారీ హైప్ తో వచ్చిన సలార్, కల్కి 2898 ఏడి వంటి మూవీస్ కూడా దానిని అందుకోలేకపోయాయి. మొత్తంగా రోజురోజుకు విపరీతంగా అందరిలో హైప్ పెంచేస్తున్న దేవర పార్ట్ 1 రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version