టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన యంగ్ టైగర్ గ్లోబల్ యాక్టర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. ఈ పాన్ ఇండియన్ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అన్ని అందరినీ ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ చేసాయి.
అనిరుద్ సంగీతం అందించిన ఈ మూవీ సాంగ్స్ కూడా ఆడియన్స్ ఫ్యాన్స్ ని విశేషమైన ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఇక నేడు సాయంత్రం దేవర పార్ట్ 1 యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో గ్రాండ్ గా ఏర్పాటు చేసారు మేకర్స్. అయితే ఆ ఈవెంట్ కి ఊహించని స్థాయిలో భారీగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరలి రావడంతో అక్కడ సెక్యూరిటీ సమస్యలు తలెత్తాయి.
హోటల్ లో పరిమిత సంఖ్యలో మాత్రమే ఫ్యాన్స్ సరిపోతారని, అయితే ఒక్కసారిగా ఇంతమంది క్రౌడ్ మధ్య ఈవెంట్ జరపడం కష్టం అని అక్కడికి చేరుకున్న పోలీస్ వారు ఈవెంట్ ని జరుపడం కష్టం అని తెలుపడంతో దేవర టీమ్ క్యాన్సిల్ చేసినట్లు ప్రకటించారు. దానితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా నిరుత్సాహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.