పాన్ ఇండియన్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మించగా అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన దేవర మూవీ ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ తో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించిన ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ కి సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ అయితే ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
దాని ప్రకారం ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ నవంబర్ మూడవ వారంలో అనగా ఆ నెల 22న ఓటిటి రిలీజ్ ఉండే అవకాశం ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అలానే అతి త్వరలో దేవర ఓటిటి రిలీజ్ కి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి థియేటర్స్ లో కట్టుకున్న దేవర ఎంతవరకు ఓటిటిలో అలరిస్తుందో చూడాలి.