యంగ్ టైగర్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీ దేవర. ఈమూవీ పై మొదటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈమూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థల పై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల దేవర నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్, పోస్టర్స్ అన్ని అందరినీ ఆకట్టుకుని ఇప్పటివరకు ఉన్న అంచనాలు పెంచేసాయి. నేడు ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో జరుగనుంది.
విషయం ఏమిటంటే, సెప్టెంబర్ 27న ఈ మూవీ రిలీజ్ కానుండగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందురోజు అర్ధరాత్రి 1 గం. కు మిడ్ నైట్ ప్రీమియర్స్ ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. కాగా ఈ షోలకు సంబంధించి ప్రస్తుతం టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అలానే అనేక ప్రాంతాల్లో వీటికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. మరి అందరి అంచనాలు అందుకుని దేవర ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.