టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన భారీ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1 రేపు గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా సైఫ్ ఆలీ ఖాన్ నెగటివ్ పాత్ర చేసారు.
ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థల పై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ గ్రాండ్ గా నిర్మించగారత్నవేలు ఫోటోగ్రఫి అందించారు. అనిరుద్ సంగీతం అందించిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ అన్ని కూడా అందరినీ విశేషంగా ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి.
ఇక మరోవైపు దేవర మేనియా రెండు తెలుగు రాష్ట్రాల్లో మారు మ్రోగుతోంది. ఎన్టీఆర్ ఈ మూవీలో దేవర, వర అనే రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాలు, అమెరికా వంటి ప్రాంతాల్లో దేవర ప్రీ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. చూడబోతే దేవర మూవీతో ఎన్టీఆర్ భారీ ఫస్ట్ డే ఓపెనింగ్ రికార్డు పెట్టె అవకాశం గట్టిగా కనపడుతోంది. మరి దేవర ఏస్థాయిలో ఆడియన్స్ ని అలరిస్తుందో చూడాలి.