టాలీవుడ్ యంగ్ టైగర్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మిస్తున్నాయి.
అనిరుద్ సంగీతం అందిస్తున్న దేవర నుండి ఇటీవల రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అన్ని కూడా అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. సెప్టెంబర్ 27న గ్రాండ్ గా దేవర మూవీ ఆడియన్స్ ముందుకి రానుంది. విషయం ఏమిటంటే, దేవర మూవీని సెప్టెంబర్ 26న అమెరికా, లాస్ ఏంజెల్స్ లోని హాలీవుడ్ ఈవెంట్ లో భాగంగా జరిగే బియాండ్ ఫస్ట్ లో భాగంగా ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.
దానికి దేవర యూనిట్ కూడా హాజరు కానుండగా పలువురు హాలీవుడ్ నటులు, టెక్నీషియన్స్ కూడా హాజరు కానున్నారట. ఇక ఈ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ సెప్టెంబర్ 25న అమెరికా పయనమవ్వనున్నారు. మొత్తంగా దేవర మూవీ రేంజ్ హాలీవుడ్ కి చేరడంతో ఫ్యాన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ రిలీజ్ అనంతరం ఎంతమేర సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.