యంగ్ టైగర్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తీస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్ పాత్ర చేస్తున్నారు.
మొదటి భాగం మూవీ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ తో అంచనాలు మరింతగా పెంచేసిన దేవర మూవీ తప్పకుండా సక్సెస్ సాదిస్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు. మరోవైపు టీమ్ కూడా ప్రమోషన్స్ పై గట్టిగా దృష్టి పెట్టింది. ఇప్పటికే ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయడంతో పాటు ఆనిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో దేవర టీమ్ స్పెషల్ ఇంటర్వ్యూ కూడా నిర్వహించారు.
విషయం ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ హెవీ యాక్షన్ డ్రామా మూవీ అని అంటున్నారు. ఎన్టీఆర్ పవర్ఫుల్ యాక్టింగ్ తో పాటు కథ లో పలు యాక్షన్, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయని, అలానే విజువల్ ఎఫెక్ట్స్, ఫైట్స్ కూడా అద్భుతంగా వచ్చినట్లు చెప్తున్నారు. మొత్తంగా అయితే దేవర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందనేది ఈ వార్త యొక్క సారాంశం.