పాన్ ఇండియన్ గ్లోబల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా అందాల నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ దేవర పార్ట్ 1. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థల పై కళ్యాణ్ రామ్, సుధాకర్ నిర్మించగా అనిరుద్ సంగీతం అందించారు.
మొదటి నుండి అందరిలో భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచిన దేవర పార్ట్ 1 మూవీ సెప్టెంబర్ 1 న ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఇక ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ రాబట్టిన దేవర మూవీ నిన్నటి సోమవారం హిందీలో రూ. 3.5 కోట్ల నెట్ రాబట్టింది. అలానే తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.7 కోట్ల కలెక్షన్ అందుకుంది. ఆ విధంగా దేవర మూవీ 4 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ రూ. 18 కోట్లు కొల్లగొట్టింది.
అలానే ఓవరాల్ గా ఈ మూవీ రూ. 270 కోట్ల మార్క్ వరకు చేరుకుంది. రేపు గాంధీ జయంతి కావడంతో నేటి సాయంత్రం నుండి రేపు మొత్తం దేవర కు మరింత మంచి కలెక్షన్ లభించే అవకాశం ఉంది. మరి ఓవరాల్ గా దేవర మూవీ ఎంతమేర రాబడుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.