టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ అందాల నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీలో సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా కనిపించగా యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ గ్రాండ్ గా నిర్మించారు.
రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీలో శ్రీకాంత్, మురళి శర్మ, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో కనిపించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర, వర పాత్రల్లో తన పెర్ఫార్మన్స్ అదరగొట్టారు. సెప్టెంబర్ 27న ఆడియన్స్ ముందుకి వచ్చిన దేవర పార్ట్ 1 మూవీ మంచి టాక్ ని సొంతం చేసుకుని బాగానే కలెక్షన్ తో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది.
విషయం ఏమిటంటే, నిన్నటితో ఈ మూవీ అఫీషియల్ గా రూ. 400 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడంతో పాటు నిన్నటితో ప్రభాస్ సాహో మూవీని అధిగమించి టాలీవుడ్ లో ఈ ఫీట్ అందుకున్న ఆల్ టైం టాప్ 6వ మూవీగా నిలిచింది. మరోవైపు ఇంకా పలు సెంటర్స్ లో దేవర బాగానే కలెక్షన్ రాబడుతుండడంతో టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది.