టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపించగా సైఫ్ ఆలీ ఖాన్ విలన్ పాత్ర చేసారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన దేవర సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది. మొదటి రోజు మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ ఫస్ట్ డే భారీ స్థాయిలో ఓపెనింగ్ రాబట్టడం విశేషం.
దాదాపుగా ఆరేళ్ళ విరామం అనంతరం ఎన్టీఆర్ సోలో హీరోగా దేవర ద్వారా ఆడియన్స్ ఫ్యాన్స్ ముందుకి రావడం, అది మంచి సక్సెస్ దిశగా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతుండడం విశేషం. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎంతో ఆనందంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఏమిటంటే, దేవర మూవీ విషయమై వస్తున్న కలెక్షన్ కి అలానే టీమ్ అనౌన్స్ చేస్తున్న పోస్టర్స్ కి దాదాపుగా రూ. 100 కోట్ల మేర తేడా ఉంటోంది. ముఖ్యంగా ఈ మూవీ ఇప్పటికే రూ. 370 కోట్లవరకు గ్రాస్ బాక్సాఫీస్ కలెక్షన్ రాబట్టగా టీమ్ మాత్రం రూ. 466 కోట్లని ప్రకటిచింది.
గతంలో కూడా సలార్, ఆదిపురుష్, కల్కి 2898 ఏడి సినిమాల విషయమై ఆ మూవీ టీమ్స్ ఈ విధంగా హైక్ చేసి అత్యధిక ఫిగర్స్ ని పోస్టర్స్ లో ప్రకటించారు. ఇక అదే విధానాన్ని దేవర టీమ్ కూడా పాటించడం ఫ్యాన్స్ కి రుచించడం లేదు. ఇక మొత్తంగా దేవర మూవీ ఫుల్ రన్ లో ఎంతమేర రాబడుతుందో చూడాలి.