యంగ్ టైగర్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో అజయ్, ప్రకాష్ రాజ్, గెటప్ శ్రీను కనిపించనున్నారు.
అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన మూడు సాంగ్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా తాజాగా థియేట్రికల్ ట్రైలర్ సినిమా పై మంచి అంచనాలు ఏర్పరిచింది. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న దేవర మూవీ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి రానుంది. విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగా దీనికి యు / ఏ సర్టిఫికెట్ ని అందించారు.
దాదాపుగా మూడు గంటల నిడివి గల ఈ మూవీకి కేవలం 4 సన్నివేశాలకు మాత్రమే కట్‌లు పడ్డాయి అవి కూడా సాధారణమైనవే. సినిమాలోని కొట్టే సీన్స్ రెండు తొలగించబడ్డాయి మరియు కత్తికి వేలాడుతున్న వ్యక్తి మృతదేహాన్ని కూడా తొలగించారు. ట్రైలర్‌లో చూపించిన షార్క్ పైన ఎన్టీఆర్ ఉన్న షాట్ సీన్‌పై సిజిఐ డిస్‌క్లైమర్‌ను జతచేయాలని ఆదేశించారు. దేవర టీమ్ కూడా స్పష్టంగా కనిపించే ఈ షాట్ మరియు మొత్తం సన్నివేశంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరి రిలీజ్ అనంతరం దేవర పార్ట్ 1 ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.