Home సినిమా వార్తలు Devara Bookings was Dull in that Areas అక్కడ చప్పుడు చేయని ‘దేవర’

Devara Bookings was Dull in that Areas అక్కడ చప్పుడు చేయని ‘దేవర’

devara movie

యంగ్ టైగర్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా విశేషమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. 

ఎన్టీఆర్ ఆర్ట్స్,యువ సుధా ఆర్ట్స్ సంస్థల పై నిర్మితం అయిన దేవర మూవీ సెప్టెంబర్ 27న అనగా రేపు గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఓవైపు రెండు తెలుగు రాష్ట్రాలు సహా అమెరికా వంటి ప్రాంతాల్లో దేవర ప్రీ బుకింగ్స్ అదిరిపోతుండగా తమిళనాడు, నార్త్ వంటి ఏరియాస్ లో మాత్రం ఈ మూవీ పెద్దగా చప్పుడు చేయడం లేదు. 

ముఖ్యంగా నార్త్ లో అయితే మంచి ఓపెనింగ్స్ ఉంటాయని అందరూ భావించారు, కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపకపోవడంతో పాటు అక్కడ పెద్దగా మూవీని ప్రమోట్ చేయకపోవడం ఒకింత దెబ్బేసిందని అంటున్నాయి సినీ వర్గాలు. 

ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో శ్రీకాంత్, అజయ్, ప్రకాష్ రాజ్ నటించారు. మరి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన దేవర రిలీజ్ అనంతరం ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version