HomeMovie News​Devara: తెలుగు స్టేట్స్ లో 'దేవర' సంచలనం

​Devara: తెలుగు స్టేట్స్ లో ‘దేవర’ సంచలనం

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర నిన్న మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చింది. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించారు. అనిరుద్ సంగీతం అందించిన ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మించాయి. 

కాగా దేవర పార్ట్ 1 లో రెండు పాత్రల్లో కనిపించి మరొక్కసారి తన అద్భుత పెర్ఫార్మన్స్ తో అందరినీ మెప్పించారు ఎన్టీఆర్. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, సైఫ్ ఆలీ ఖాన్, మురళి శర్మ తదితరులు ఇతర పాత్రలు పోషించిన దేవర డే 1 తెలుగు స్టేట్స్ లో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా భారీ మూవీ ఆర్ఆర్ఆర్ తరువాత అనేక​ ప్రాంతాల్లో దేవర రెండు, మూడు స్థానాల్లో నిలవడం విశేషం. 

ఇక ఈ మూవీ డే 1 తెలుగు రాష్ట్రాల షేర్ రూ. 61.25 కోట్లు దక్కించుకుని రెండవ స్థానములో నిలిచింది. కాగా ఆర్ఆర్ఆర్ మూవీ రూ. 73.99 కోట్లతో టాప్ స్థానంలో నిలబడింది. ఇక ఈ రెండు రోజులు వీకెండ్ కావడంతో మూవీకి బాగానే కలెక్షన్ లభించే అవకాశం కనపడుతోంది. మరి దేవర రాబోయే రోజుల్లో ఇంకెంత మేర రాబడుతుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp

See also  Another Heroine in Prabhas Movie ప్రభాస్ కి జోడీగా మరొక ఫారిన్ నటి ?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories