Home సినిమా వార్తలు Devara Big Test for Koratala ‘దేవర’ : కొరటాలకు చాలా పెద్ద పరీక్షే 

Devara Big Test for Koratala ‘దేవర’ : కొరటాలకు చాలా పెద్ద పరీక్షే 

Koratala Siva

టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ భర్తీ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థల పై కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ నిర్మించగా కీలక పాత్రల్లో సైఫ్ ఆలీ ఖాన్, శ్రీకాంత్, తాళ్లూరి రామేశ్వర్, గెటప్ శ్రీను నటిస్తున్నారు. 

ఇప్పటికే దేవర నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, రెండు ట్రైలర్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి. సెప్టెంబర్ 27న దేవర భారీ స్థాయిలో ఆడియన్స్ ముందుకి రానుంది. వాస్తవానికి దేవర మూవీ సక్సెస్ దర్శకుడు కొరటాల శివకు పెద్ద పరీక్షే అని చెప్పాలి. 

ఆచార్యతో భారీ డిజాస్టర్ చవిచూసి నెగటివ్ ఇంపాక్ట్ సొంతం చేసుకున్న కొరటాల కెరీర్ కి దేవర సక్సెస్ ఎంతో అవసరం. మరోవైపు ఆయన ఎంతో శ్రమపడి ఈ మూవీని తెరకెక్కించారని, తప్పకుండా మంచి సక్సెస్ అవుతుందని హీరో ఎన్టీఆర్ సహా టీమ్ మొత్తం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరి దేవర ఎంతమేర విజయం అందుకుంటుందో తెలియాలి అంటే మరొక మూడు రోజులు ఆగాల్సిందే. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version