టాలీవుడ్ లేటెస్ట్ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1 ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి ప్రస్తుతం మంచి కలెక్షన్స్ తో థియేటర్స్ లో కొనసాగుతోంది. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మించగా హీరోయిన్ గా జాన్వీ కపూర్ కనిపించారు.
ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించిన ఈ మూవీకి అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. దాదాపుగా ఆరేళ్ళ అనంతరం తమ హీరో నుండి వచ్చిన సోలో మూవీ మంచి సక్సెస్ దిశగా కొనసాగుతుండడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన సూపర్ హిట్ మూవీ హను మాన్ రూ. 300 కోట్ల మార్క్ గ్రాస్ ని నేటితో దేవర బీట్ చేసింది.
నేడు గాంధీ జయంతి సెలవు దినం కావడంతో దేవర థియేటర్స్ చాలావరకు కళకళలాడాయి. ఇక ప్రస్తుతం దేవరకు వస్తున్న కలెక్షన్స్ ని బట్టి చూస్తుంటే మొత్తంగా ఇది టాలీవుడ్ టాప్ 6 వ స్థానంలో నిలిచే అవకాశం గట్టిగా కనపడుతోంది. మరి రాబోయే రోజుల్లో దేవర ఎంతమేర రాబడుతుందో చూడాలి.