యంగ్ టైగర్ గ్లోబల్ ఐకాన్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ ప్రతిష్టాత్మక యాక్షన్ ఎమోషనల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకుంది.
ఇటీవల రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని దాటిన దేవర ప్రస్తుతం అక్కడక్కడా మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ భారీ స్థాయిలో రూపొందించిన ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయగా అనిరుద్ సంగీతం అందించారు. ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందిన ఈ మూవీలో శ్రీకాంత్, మురళి శర్మ, సైఫ్ ఆలీ ఖాన్, తదితరులు ఇతర కీలక పాత్రలు చేసారు. విషయం ఏమిటంటే, వాస్తవానికి ఈ మూవీని నవంబర్ 8న ఓటిటి ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
ఇక లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం దీపావళి కానుకగా అనగా ఈ నెల చివర్లోనే దేవర ఓటిటి ఆడియన్స్ ముందుకి రానుందట. అయితే ముందుగా సౌత్ వర్షన్స్ లో అలానే నవంబర్ మూడవ వారంలో హిందీ వర్షన్ అందుబాటులోకి వస్తుందట. కాగా ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ యొక్క ఓటిటి రైట్స్ ని భారీ ధరకు కొనుగోలు చేసిన దేవర ముందుగానే ఓటిటిలో రిలీజ్ కానున్న విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం రావాల్సి ఉంది.