యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా యువ సుధా ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మించాయి. సెప్టెంబర్ 27న గ్రాండ్ గా భారీ స్థాయిలో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.
ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో అద్భుతమైన పెర్ఫార్మన్స్ కనబరిచిన ఈ మూవీకి అనిరుద్ సంగీతం ఆందించారు. ఇక ఓపెనింగ్స్ పరంగా భారీగా రాబట్టిన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్ తో కొనసాగుతోంది. ఇక దేవర పార్ట్ 1 మూవీ ఆరు రోజుల కలక్షన్ పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లో రూ. 158 కోట్లు రాబట్టింది.
ఇక కర్ణాటకలో రూ. 28 కోట్లు, తమిళనాడు రూ. 8.5 కోట్లు , కేరళ రూ. 2 కోట్లు, అలానే రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 52 కోట్లు కొల్లగొట్టింది. ఆ విధంగా ఆల్ ఇండియా పరంగా దేవర ఆరు రోజుల్లో రూ. 248.5 కోట్లు, ఓవర్సీస్ లో 8.15 మిలియన్స్ అనగా రూ. 68 కోట్లు దక్కించుకుంది. మొత్తంగా దేవర మూవీ వరల్డ్ వైడ్ ఆరు రోజులకు రూ. 317 కోట్లు రాబట్టి ఈ వీకెండ్ కి రూ. 400 కోట్ల జాబితాలో చేరే అవకాశం కనపడుతోంది.