Homeసినిమా వార్తలుDeepika Padukone: ప్రభాస్ ప్రాజెక్ట్ కే పై అంచనాలను పెంచిన దీపికా పదుకొనె పోస్టర్

Deepika Padukone: ప్రభాస్ ప్రాజెక్ట్ కే పై అంచనాలను పెంచిన దీపికా పదుకొనె పోస్టర్

- Advertisement -

హీరోయిన్ దీపికా పదుకొనె పుట్టినరోజు సందర్భంగా ప్రాజెక్ట్ కే చిత్రం నుండి ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. కాగా ఈ స్టిల్ ఈ సినిమా నుండి దీపికా పదుకొనె లుక్ ను మొదటి సారి ప్రేక్షకులకి పరిచయం చేసింది.

ఇక మనం ఈ పోస్టర్ లో దీపికాని ఫ్యూచరిస్టిక్ అవతారంలో చూడవచ్చు. ఈ పోస్టర్ ఖచ్చితంగా సినిమా పై ప్రేక్షకుల అంచనాలను పెంచింది మరియు ఈ చిత్రంలో ప్రభాస్ ఎలాంటి లుక్ లో ఉంటాడో అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. పోస్టర్లో ‘ఎ హోప్ ఇన్ ది డార్క్’ అనే పదాలు ఉన్నాయి, ఈ కాప్షన్ చూస్తే దీపికా పదుకొనె ఒక బలమైన పాత్రను చేస్తున్నట్లే సూచిస్తుంది.

సిల్హౌట్ పోస్టర్లో కత్తిరించిన జుట్టు మరియు ప్రత్యేకమైన వస్త్రధారణలో దీపికా ను మనం చూడచ్చు. ఈ పోస్టర్ సినిమా యొక్క సైన్స్ ఫిక్షన్ శైలికి సరిగ్గా సరిపోతుంది. ఈ చిత్రంలో దీపికాతో పాటు అమితాబ్ బచ్చన్ కూడా ఒక కీలక పాత్రలో నటించనున్నారు.

READ  ఆచార్య వీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు కారణం కొరటాల శివ అని నిందించిన మణిశర్మ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కే’. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ నేతృత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పై ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఇటీవలే ప్రాజెక్ట్ కే చిత్ర బృందం ప్రత్యేకంగా రూపొందించిన ఒక చక్రాన్ని రివీల్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈరోజు ఈ సినిమాలో ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న దీపికా పదుకొనె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడం ద్వారా ఇటు ప్రభాస్ అభిమానులు మరియు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా పై మరింత అంచనాలు పెరిగాయి.

ఈ చిత్రంలో భారీ తారాగణంతో పాటు ప్రతిభావంతులైన సిబ్బంది కూడా ఉంది మరియు ఇంతకు ముందు ఎన్నడూ లేని విజువల్స్ ప్రాజెక్ట్ కే లో ఉంటాయని అంటున్నారు.

బాహుబలి తర్వాత సాహో, రాధే శ్యామ్ వంటి సినిమాలతో నిరాశ పరచిన ప్రభాస్, తర్వాత లైనప్ మాత్రం అద్భుతంగా సమకూర్చుకున్నారు. సాలార్, ప్రాజెక్ట్ కే వంటి సినిమాలు తమ హీరోకి భారీ పాన్ ఇండియా విజయాలు అందిస్తాయని ప్రభాస్ అభిమానులు ఆశిస్తున్నారు.

READ  Pathan: చిక్కుల్లో షారుఖ్ ఖాన్ కొత్త సినిమా - చిత్ర బృందానికి మధ్య ప్రదేశ్ హోమ్ మంత్రి హెచ్చరిక

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories