Home సినిమా వార్తలు అఫీషియల్ : AA 22 లో దీపికా పదుకొనె 

అఫీషియల్ : AA 22 లో దీపికా పదుకొనె 

allu arjun deepika padukone

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ప్రస్తుతం ఒక భారీ ప్రతిష్టాత్మక మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తుండగా సాయి అభ్యంకర్, హ్యాన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే అందరిలో విశేషమైన అంచనాలు ఏర్పరిచిన ఈ క్రేజీ ప్రాజక్ట్ లో అల్లు అర్జున్ మూడు పాత్రలు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా విషయం ఏమిటంటే, నేడు ఈ ప్రాజక్ట్ లోకి ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనె ని తీసుకుంటున్నట్లు టీమ్ అఫీషియల్ గా ఒక చిన్న వీడియో బైట్ ద్వారా అనౌన్స్ చేసింది.

కాగా ఇటీవల ఈ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకోగా నేడు రిలీజ్ అయిన వీడియో కోసం సినిమా పై మరింతగా అంచనాలు ఏర్పరిచింది. అత్యున్నత స్థాయిలో హై టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందుతున్న ఈ మూవీ యొక్క బడ్జెట్ కూడా చాలా ఎక్కువని, త్వరలోనే ప్రారంభం కానున్న ఈమూవీ 2026 మధ్యలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. మరి అందరిలో ఈ స్థాయి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ రిలీజ్ తరువాత ఎంతమేర సక్సెస్ అవుతుందో చూడాలి

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version