ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండగా, 2023 జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాకి ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో చిత్ర బృందం దేశవ్యాప్తంగా భారీ ప్రమోషన్స్ కు సిద్ధం అవుతున్నారు. కాగా తాజాగా ఆదిపురుష్ యొక్క ట్రైలర్ విడుదల తేదీ కూడా ప్రకటించటంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఆదిపురుష్ ట్రైలర్ ను మే 8న భారీ స్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు. మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలలో ఒకటిగా తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ డ్రామా ట్రైలర్ ను కొత్త వీఎఫ్ఎక్స్ తో బిగ్ స్క్రీన్ పై చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మొదట్లో అంతగా క్రేజ్ లేకున్నా మెల్లమెల్లగా సినిమా పై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర బృందం. కొత్త పోస్టర్, జై శ్రీరామ్ పాట ఈ సినిమాకు మొదట్లో వచ్చిన కొంత ప్రతిఘటనను తిప్పికొట్టడంలో ఎంతగానో దోహదపడ్డాయనే చెప్పాలి.
ప్రభాస్ ‘ఆదిపురుష్’ ఇండియాలోనే అత్యంత ఖరీదైన సినిమా కావడంతో ప్రమోషన్స్ కూడా అంతే భారీ స్థాయిలో ఉంటాయని భావిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన జానకి పాత్రలో కృతి సనన్, లంకేష్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు. ప్రభాస్ స్టార్ డమ్, హిందీలో ఓం రౌత్ బ్రాండ్ వాల్యూకు తోడు రామాయణం ఆధారిత చిత్రం కావడంతో, సినిమా కంటెంట్, మెరుగైన విఎఫ్ఎక్స్, టాక్ పాజిటివ్ గా ఉంటే ఆదిపురుష్ ఖచ్చితంగా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి దృష్టీ ట్రైలర్ పైనే ఉంది, ప్రేక్షకులు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగక తప్పదు.