నాని నటించిన దసరా గత నెల చివర్లో విడుదలై సంచలన ఓపెనింగ్ రికార్డులు నమోదు చేసి ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. నైజాంలో ఈ సినిమా చాలా మంచి వసూళ్లు రాబట్టింది. ఐతే తొలినాళ్ళ సందడి చల్లారిన తర్వాత సీడెడ్, ఆంధ్రా ప్రాంతాలు మాత్రం ఈ సినిమాకు బలహీనమైన ప్రదేశాలుగా నిలిచాయి.
నైజాం, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో సూపర్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దసరాకు ఆంధ్రా, సీడెడ్ లలో మాత్రం అంత మంచి పర్ఫార్మెన్స్ కనబర్చలేదు. ముఖ్యంగా మాస్ సెంటర్లలో ఈ సినిమా ఆశించిన స్థాయిలో బ్రేకప్ మార్కును అందుకోలేకపోయింది. ఇప్పుడు బయ్యర్లు ఈ వీకెండ్ లో సినిమా ప్రదర్శన పై భారీ ఆశలు పెట్టుకోవడంతో పాటు రంజాన్ కు ముందు సినిమా వసూళ్లకు కొంత లాభం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ రంజాన్ వీకెండ్ సహాయంతో దసరా సినిమా ఆంధ్రా, సీడెడ్ లో 100% రికవరీ సాధిస్తుందని బయ్యర్లు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లోని పలు బీ అండ్ సీ కేంద్రాల్లో దసరా 70 నుంచి 80 శాతం రికవరీ చేసింది. ఐతే శాకుంతలం, రుద్రుడు చిత్రాల పేలవ ప్రదర్శనతో గత వారాంతంలో దసరా హఠాత్తుగా పుంజుకుంది.
చాలా సార్లు ప్రేక్షకులు కొత్త సినిమాల పై ఆసక్తి చూపకపోతే, వారు అప్పటికే చూసిన మంచి సినిమాను మళ్ళీ ఎంచుకుంటారు. ఇప్పుడు ఈ వారం కూడా పెద్ద సినిమా అంటూ ఏదీ కనిపించకపోవడంతో ఈ వీకెండ్ లో కూడా దసరా సంచలన స్థాయిలో వసూళ్లు సాధిస్తుందని బయ్యర్లు ఆశిస్తున్నారు. మరి వారి ఆశలు నిజం అవ్వాలని ఆశిద్దాం.