ఇటీవల ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా తెరకెక్కిన మైథలాజికల్ ఫాంటసీ ఎంటర్టైనర్ మూవీ హను మాన్. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ పేద విజయం సొంతం చేసుకుని హీరోగా తేజ కి అలానే దర్శకుడిగా ప్రశాంత్ వర్మకి విపరీతమైన పేరు తీసుకువచ్చింది.
దాని అనంతరం ఆ మూవీకి సీక్వెల్ గా జై హానుమాన్ ని అనౌన్స్ చేసారు ప్రశాంత్ వర్మ. దానితో ఈ మూవీ పై అందరిలో భారీ స్థాయి అంచనాలు ఏర్పడ్డాయి. మైత్రి మూవీ మేకర్స్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ సంస్థ ల పై అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రాండ్ లెవెల్లో నిర్మితం కానున్న ఈ మూవీలో ప్రధాన పాత్ర అయిన హనుమంతుల వారి పాత్రలో ప్రముఖ కన్నడ దర్శకుడు, నటుడు అయిన రిషబ్ శెట్టి నటిస్తున్నారు, ఈ విషయమై టీమ్ ఆయనని అఫీషియల్ గా దీపావళి రోజున అనౌన్స్ చేసింది.
అయితే విషయం ఏమిటంటే, నేడు తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో రిషబ్ శెట్టి తో పాటు దగ్గుబాటి రానా తో కలిసి దిగిన ఒక పిక్ ని పోస్ట్ చేసారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. దానిని బట్టి రానా కూడా జై హనుమాన్ మూవీలో ఒక కీలక పాత్ర చేస్తున్నారనేది టాలీవుడ్ బజ్. ఇక ఈ మూవీలో శ్రీరామునిగా ఎవరు నటించనున్నారు అనే దాని పై అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం మోక్షజ్ఞతో మూవీ ఆ తరువాత మరొక మూవీతో కూడా బిజీగా ఉన్న ప్రశాంత్ వర్మ, ఆపైనే దీనిని తెరకెక్కించనున్నారు.