Home సినిమా వార్తలు Daaku Maharaj First Song Release Date Fix ‘డాకు మహారాజ్’ ఫస్ట్ సాంగ్ రిలీజ్...

Daaku Maharaj First Song Release Date Fix ‘డాకు మహారాజ్’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

daaku maharaj

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పై బాలకృష్ణ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన టైటిల్ టీజర్ కి అందరి నుండి మంచి రెస్సాన్స్ లభించింది. 

విషయం ఏమిటంటే, తమ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ ని డిసెంబర్ 14న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్, ఆ సాంగ్ యొక్క ప్రోమో నేడు ఉదయం 10 గం. 8 ని. లకు రిలీజ్ అవుతుందని తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా తెలిపారు. 1890ల కాలం నాటి దోపిడీదారుడు డాకు సింగ్ యొక్క జీవిత కథ ఆధారంగా ఈ మూవీ గ్రాండ్ గా రూపొందుతున్నట్లు టాక్. 

అయితే అతడు దోపిడీ దొంగ అయినప్పటికీ ఎందరో పేదసాదలను తనవంతుగా ఆడుకుకి వారి పాలిట దేవుడిగా నిలిచిన డాకు సింగ్ కి గుడి కూడా ఉంది. మొత్తంగా అయితే అతడి పవర్ఫుల్ పాత్రలో బాలకృష్ణ ఈ మూవీలో తన అత్యద్భుత నటనతో అందరినీ ఆకట్టుకోవడం ఖాయం అంటోంది టీమ్. కాగా ఈ మూవీ జనవరి 12న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version