నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన తాజా మాస్ యాక్షన్ ఎమోషనల్ సినిమా డాకు మహారాజ్. ఊర్వశి రౌటేలా, శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి, బాబీ డియోల్ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది.
ఓవరాల్ గా ఈ సినిమా ఆల్మోస్ట్ బాక్సాఫీస్ రన్ పూర్తి చేసుకునే పరిస్థితికి వచ్చేసింది. మొత్తంగా చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గా రూ. 80 కోట్ల బాక్సాఫీస్ షేర్ ని డాకు మహారాజ్ రాబట్టింది. అక్కడక్కడ పరవాలేదనిపించేలా బ్రేక్ ఈవెన్ సాధించిన డాకు మహారాజ్ బాలకృష్ణ కెరీర్ లో మంచి కలెక్షన్లు అందుకున్న మూవీగా చెప్పుకోవచ్చు.
అయితే అటు సంక్రాంతికి వస్తున్నాం భారీ బ్లాక్ బస్టర్ కొట్టడంతో కొన్ని ఏరియాస్ లో డాక్ మహారాజ్ కి కలెక్షన్ పరంగా గండి పడింది. కాగా ఓవరాల్ గా ఈ మూవీ రూ. 100 కోట్లు సాధిస్తుందని భావించిన బాలకృష్ణ అభిమానులకి ఒకంత నిరాశను అయితే ఇది మిగిల్చింది. కాగా బాలకృష్ణ పవర్ఫుల్ యాక్టింగ్, దర్శకుడు బాబీ టేకింగ్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి అందరి నుండి మంచి మార్కులు పడ్డాయి.