నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఇటీవల బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ డాకు మహారాజ్. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలోని కీలకపాత్రల్లో బాబీ డియోల్, శ్రద్ధ శ్రీనాథ్, సచిన్ ఖేడేకర్, చాందిని చౌదరి, ఊర్వశి రౌటేలా నటించారు. ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది.
బాలకృష్ణ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి ప్రధాన హైలైట్. థియేటర్స్ లో బాగానే కలెక్షన్ రాబట్టిన డాకు మహారాజ్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ లెవెల్ లో నిర్మించారు. ఇక ఈ మూవీ ఫిబ్రవరి 21న ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకి రానుంది.
అయితే విషయం ఏమిటంటే మొత్తంగా ఐదు పాన్ ఇండియన్ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. తెలుగుతోపాటు కన్నడ, హిందీ, మలయాళం, తమిళంలో కూడా ఈ సినిమా ఓటిటి ఆడియన్స్ ని అలరించనుంది. మరి డాకు మహారాజ్ ఎంత మేర ఓటిటి ఆడియన్స్ ని మెప్పిస్తుందో చూడాలి