నాటు నాటు ఆస్కార్ విజయంతో దేశ వ్యాప్తంగా సంబరాలు వెల్లువెత్తాయి. ఈ భారీ విజయం తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమ సభ్యులు ఏకమై ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి తమ అభినందానాలు తెలియజేశారు. అలాగే రజినీకాంత్, చిరంజీవి, షారుఖ్ ఖాన్ వంటి సూపర్ స్టార్లతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలక పాత్రలను పోషించిన అలియా భట్, అజయ్ దేవగణ్ మరియు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్, సూపర్ స్టార్లు హృతిక్ రోషన్, మహేష్ బాబు వంటి ప్రముఖులు ఆర్ ఆర్ ఆర్ సాధించిన ఘన విజయం సాధించిన తర్వాత శుభాకాంక్షలు తెలిపారు.
ఇక ఆస్కార్ గెలిచిన తర్వాత నాటు నాటు పాట చుట్టూ హైప్ బాగా పెరిగిపోయింది. ఆస్కార్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఎంపికైన తర్వాత యూఎస్ స్పోటిఫై స్ట్రీమ్స్ లో ఈ పాట కోసం సెర్చ్ 960% పెరిగింది. ఈ చార్ట్ బస్టర్ గురించి ఇంతవరకూ వినని సాధారణ ప్రజలు కూడా దీని ప్రజాదరణ గురించి తెలుసుకున్న తర్వాత ఆసక్తిగా ఉన్నారు, మరికొందరు ఈ పాటను ఆడియో యాప్ లలో రిపీట్ ప్లేలతో ఈ విజయాన్ని జరుపుకున్నారు.
జనవరిలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా గెలుచుకున్న నాటు నాటు యొక్క ప్రపంచ ఆధిపత్యం ఇప్పుడు ఆస్కార్ అవార్డుతో పరిపూర్ణం అయింది. ఆస్కార్ వేడుకలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ఈ పాటను గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ లైవ్లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రదర్శనలో చిత్ర కథానాయకులైన రామ్ చరణ్, ఎన్టీఆర్ పాల్గొంటారు అని అందరూ ఆశించారు కానీ అది జరగలేదు.