తాజాగా నాచులు స్టార్ నాని సమర్పణలో హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ కోర్ట్ డ్రామా యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కోర్ట్. ఈ మూవీని రామ్ జగదీశ్ తెరకెక్కించగా శివాజీ, సాయి కుమార్, ప్రియదర్శి ఇతర ముఖ్య పాత్రలు చేసారు.
మొన్న మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అదరగొట్టే కలెక్షన్ తో కొనసాగుతోంది. ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందిన ఈ మూవీలో పోక్సో యాక్ట్ గురించి అలానే దానియొక్క దుర్వినియోగం గురించి చక్కగా చూపించారు.
అలానే యువ నటుడు కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ దిల్ రుబా. ఈ మూవీలో రుక్సార్ ధిల్లాన్, కాథీ డేవిసన్ హీరోయిన్స్ గా నటించగా యువ దర్శకుడు విశ్వ కరణ్ దీనిని తెరకెక్కించారు.
ప్రమోషన్స్ బాగానే చేసిన ఈ మూవీ ఏమాత్రం ఆకట్టుకునే విధంగా రూపొందకపోవడంతో ఆడియన్స్ నుండి నెగటివ్ ఫీడ్ బ్యాక్ అందుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పేలవంగా కొనసాగుతోంది దిల్ రుబా మూవీ. విషయం ఏమిటంటే వీటిలో కోర్ట్ మూవీ యొక్క ఒటిటి హక్కులని ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ వారు మంచి ధరకు కొనుగోలు చేసారు.
కాగా ఈ మూవీ నాలుగు వారల అనంతరం ఓటిటి ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక దిల్ రుబా బాక్సాఫీస్ పరిస్థితి పేలవంగా ఉండడంతో ఈ మూవీ ఇంకా ముందుగానే ఓటిటి లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.