యువ నటీనటులు హర్ష్ రోషన్, శ్రీదేవి కలయికలో ప్రముఖ నటీనటులు సాయి కుమార్, శివాజీ,రోహిణి, శుభలేఖ సుధాకర్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో యువ దర్శకుడు రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కోర్ట్ డ్రామా యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కోర్ట్. ఆకట్టుకునే రీతిన అలరించే కథ, కథనాలతో తెరకెక్కిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి మొదటి రోజు నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ మూవీలో ప్రియదర్శి, శివాజీ, హర్ష వర్ధనల నడుమ కోర్ట్ లో సాగే వాదనల సన్నివేశాలు అందరినీ ఎంతో ఆకట్టుకుంటున్నాయి.
కోర్ట్ 6 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్
ప్రీమియర్స్ + డే 1–8.10 కోట్లు
2వ రోజు – 7.80 కోట్లు
3వ రోజు – 8.50 కోట్లు
4వ రోజు – 4:50 కోట్లు
5వ రోజు – 4.65 కోట్లు
6వ రోజు – 3.3 కోట్లు
కోర్టు 6 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ – 36.85 కోట్లు
కోర్టు 6 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ షేర్ దాదాపు 18 కోట్లు
నాచురల్ స్టార్ నాని ఈ మూవీకి వ్యవహరించగా యువ నిర్మాత ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీని గ్రాండ్ గా నిర్మించారు. ఇక అటు యుఎస్ఏ లో కూడా ఈ మూవీ మంచి కలెక్షన్ రాబడుతూ 1 మిలియన్ దిశగా దూసుకెళుతోంది. మొత్తంగా తమ మూవీకి ఇంతమంచి ఆదరణ అందించడంతో ఒకవేళ దీనికి రాబోయే రోజుల్లో సీక్వెల్ తీస్తే మరింత గ్రాండ్ గా నిర్మిస్తాం అని నిర్మాత నాని ఇటీవల సక్సెస్ మీట్ లో భాగంగా మాట్లాడుతూ చెప్పారు. మరి ఓవరాల్ గా కోర్ట్ మూవీ ఎంతమేర రాబడుతుందో చూడాలి.