Homeసినిమా వార్తలుCoolie Teaser Ready for Release రిలీజ్ కి రెడీ అవుతున్న 'కూలీ' టీజర్

Coolie Teaser Ready for Release రిలీజ్ కి రెడీ అవుతున్న ‘కూలీ’ టీజర్

- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శృతిహాసన్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర తదితరులు కీలకపాత్రల్లో లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతోన్న మాస్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ కూలీ. ప్రారంభం నాటి నుంచి అందరిలో కూడా విశేషమైన క్రేజ్ కలిగిన ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తోంది. 

ప్రస్తుతం కూలి మూవీ షూటింగ్ వేగవంతంగా అయితే జరుపుకుంటుంది. ఇటీవల రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ కి అందరి నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పటికే ఇటీవల చికిటు వైబ్ అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ని కూడా రిలీజ్ చేయగా అది కూడా బాగా రెస్పాన్స్ సొంతం చేసుకుంది. 

కాగా లేటెస్ట్ కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం త్వరలో కూలీ నుంచి అఫీషియల్ టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ అయితే సన్నాహాలు చేస్తున్నారట. ముఖ్యంగా ఈ మూవీలో లోకేష్ కనకరాజు టేకింగ్ తో పాటు రజనీకాంత్ పవర్ ఫుల్ యాక్టింగ్ అదిరిపోతుందని ఓవరాల్ గా మిగతా పాత్రధారులు అందరూ కూడా అద్భుతంగా నటిస్తున్నారని, రిలీజ్ అనంతరం కూలి పెద్ద విజయం ఖాయమని టీం ఆశాభావం వ్యక్తం చేస్తోంది కాగా కూలి సినిమా అక్టోబర్ లో ఆడియన్స్ ముందుకి రానుంది.

READ  A Double Treat for Sreeleela Fans this Diwali దీపావళికి శ్రీలీల ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ?

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories