సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ కూలీ. ఈ మూవీలో అమీర్ ఖాన్, శృతి హాసన్, నాగార్జునతో పాటు సత్యరాజ్, ఉపేంద్ర కీలక పాత్రలు చేసారు.
ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈమూవీకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించగా సన్ పిక్చర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించింది.
మొదటి నుండి అందరిలో భారీ క్రేజ్ ఏర్పరిచిన కూలీ మూవీ రేపు అత్యధిక థియేటర్స్ లో పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క ప్రీ టికెట్ బుకింగ్స్ ఇటీవల భారీ స్థాయిలో జరుపుకుని రిలీజ్ కి ముందే సంచలన రికార్డు నమోదు చేసాయి.
తాజాగా కూలీ మూవీ ప్రీ బుకింగ్స్ లో ఏకంగా రూ. 100 కోట్ల అమ్మకాలు జరుపుకుని అందుకుని సంచలన రికార్డు ని సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ రజినీకాంత్ కెరీర్ లో మొదటి రూ. 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ మూవీ కాగా కోలీవుడ్ లో మూడవది. గతంలో విజయ్ నటించిన గోట్, లియో ఈ ఫీట్ ని అందుకున్నాయి.
లోకేష్ తన మార్క్ యాక్షన్ అంశాలతో పాటు రజిని మార్క్ ఎలివేషన్స్ తో రూపోంచిన కూలీ తప్పకుండా భారీ సక్సెస్ సొంతం చేసుకోవడం ఖాయం అని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరి రేపు గ్రాండ్ గా రిలీజ్ కానున్న కూలీ ఎంతమేర సక్సెస్ అవుతుందో చూడాలి.