Homeసినిమా వార్తలు'లియో' ఫస్ట్ వీక్ కలెక్షన్ ని బీట్ చేయలేకపోయిన 'కూలీ'

‘లియో’ ఫస్ట్ వీక్ కలెక్షన్ ని బీట్ చేయలేకపోయిన ‘కూలీ’

- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ సంస్థ పై గ్రాండ్ గా నిర్మితం అయిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ కూలీ. ఈ మూవీని యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించగా అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. సత్యరాజ్, శృతిహాసన్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, అమీర్ ఖాన్ తదితరులు ఇందులో కీలక పాత్రలు చేసారు

మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల రిలీజ్ అయి బాగానే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే ఓపెనింగ్స్ పరంగా రూ. 150 కోట్లు రాబట్టింది కూలీ మూవీ. మొత్తంగా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ రెస్పాన్స్ తో కొనసాగుతున్న కూలీ ఇప్పటికే రూ. 400 కోట్ల గ్రాస్ మార్క్ ని చేరుకుంది.

అయితే మొత్తంగా ఫస్ట్ వీక్ పరంగా మాత్రం ఇలయదళపతి విజయ్ నటించిన లియో మూవీని మాత్రం దాటలేకపోయింది. కాగా లియో మూవీ ఫస్ట్ వీక్ రూ. 466 కోట్ల మేర గ్రాస్ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం కూలీ బాక్సాఫీస్ పరిస్థితి చూస్తే క్లోజింగ్ లో రజిని నటించిన 2.O, జైలర్ కలెక్షన్స్ ని బీట్ చేయడం ఆల్మోస్ట్ కుదరదు. మరి మొత్తంగా ఈ మూవీ రూ. 500 కోట్లు చేరుకుంటుందో లేదో చూడాలి. 

READ  జంజీర్ - ఆదిపురుష్ - వార్ 2

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories