సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ గ్యాంగ్స్టర్ మాస్ డ్రామా మూవీ కూలీ. ఈ మూవీలో నాగార్జున నెగిటివ్ పాత్ర చేస్తుండగా ఇతర కీలకపాత్రల్లో ఉపేంద్ర, అమీర్ ఖాన్, సత్యరాజ్, శృతిహాసన్ నటిస్తున్నారు. ఇక స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే కనిపించనుంది.
ఇప్పటికే తెలుగు, హిందీ, తమిళ్ తో పాటు అన్ని భాషల్లో కూడా భారీ స్థాయి క్రేజ్ కలిగిన ఈ మూవీ మరొక రెండు రోజుల్లో ఆడియన్స్ ముందుకు రానున్న విషయం తెలిసిందే. మరోవైపు కూలీకి సంబంధించి ఇప్పటికే యూఎస్ఏ ప్రీమియర్స్ పరంగా భారీ స్థాయి బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి.
మొత్తంగా ఈ సినిమా అక్కడ రెండు మిలియన్ పైగా ప్రీమియర్ బుకింగ్స్ జరుపుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక లేటెస్ట్ గా సినీ విశ్లేషకుల అంచనా ప్రకారం మొత్తంగా ఈ సినిమా డే వన్ రూ. 150 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ ని నమోదు చేసేటువంటి అవకాశం కనబడుతోంది.
మరోవైపు తమిళనాడు, కేరళ, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ తో కలుపుకొని ఈ సినిమా ఇప్పటికే రూ. 100 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ని జరుపుకుంది. మరి అందరిలో ఎంతో భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచిన కూలీ మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలి.