సమంత నటించిన యశోద నవంబర్ 11న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కాలేకపోయినా ఈ చిత్రం మంచి కలెక్షన్లనే అందుకుంది. తొలి రోజు మంచి ఓపెనింగ్ అందుకున్నా, ఆ తర్వాత ఈ సినిమా పబ్లిక్ టాక్ తగ్గిపోయింది. ఒక మీడియం రేంజ్ సినిమాకి, పబ్లిక్ టాక్ చాలా కీలకం మరియు అది నెమ్మదించిన ఫలితంగా, యశోద సినిమా చెప్పుకోదగ్గ కలెక్షన్లను నమోదు చేయలేకపోయింది.
ఈ చిత్రం థియేట్రికల్ రన్ అయిన త్వరగానే OTTలో విడుదల చేయడానికి సన్నాహాలు చేయబడ్డాయి, అయితే EVA IVF హాస్పిటల్‌తో న్యాయపరమైన సమస్యల కారణంగా యశోద ఓటిటి రిలీజ్ వాయిదా పడింది.
ఎందుకంటే యశోద సినిమాలో ఉపయోగించిన ఆసుపత్రి పేరు కూడా EVA అవడంతో.. సినిమాలో ఆసుపత్రిని హీనంగా చూపించి ఆసుపత్రి మనోభావాలను దెబ్బతీశారని వివాదం చెలరేగింది. దీంతో EVA సంస్థ వారు కోర్టు మెట్లెక్కారు.
అయితే ఈ గందరగోళం ఇప్పుడు సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. ఇది కేవలం అపార్థం మరియు యాదృచ్చికం వల్ల ఉద్భవించిన సాధారణ సందర్భం అని ఇరు వర్గాలూ రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు సమస్య పరిష్కరించబడింది కనుక యశోద సినిమా డిసెంబర్ 9 నుండి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉంది.
యశోదలో టైటిల్ పాత్రలో అద్భుతమైన నటనను కనబర్చిన సమంతతో పాటు.. వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, మరియు దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కాగా ఈ చిత్రానికి హరి-హరీష్ ద్వయం రచన మరియు దర్శకత్వం వహించారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రానికి శివలెంక కె ప్రసాద్ నిర్మాతగా వ్యవహారించారు.