Home సినిమా వార్తలు Confusion Continues over Allu Arjuns Arrest అల్లు అర్జున్ అరెస్ట్ పై కొనసాగుతున్న సందిగ్థత

Confusion Continues over Allu Arjuns Arrest అల్లు అర్జున్ అరెస్ట్ పై కొనసాగుతున్న సందిగ్థత

allu arjun latest

నటుడు అల్లు అర్జున్ ఇటీవల హైదరాబాద్ సంధ్య థియేటర్ లో తన లేటెస్ట్ మూవీ పుష్ప 2 ని ప్రత్యేకంగా ఫ్యామిలీ తో కలిసి వీక్షించిన విషయం తెల్సిందే. ఆ సమయంలో సంధ్య థియేటర్ వద్ద భారీ తొక్కిసలాట జరగడంతో రేవతి అనే మహిళా అక్కడికక్కడే మృతి చెందడంతో పాటు ఆమె కుమారుడు తేజ పరిస్థితి విషమంగా మారింది.

కాగా ఈ దుర్ఘటన పై అల్లు అర్జున్ మరియు సంధ్య థియేటర్ యాజమాన్యం పై కేసు నమోదు కాగా నేడు కొద్దిసేపటి క్రితం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసారు. దానితో ఆయన అరెస్ట్ పై ఫ్యాన్స్ అందరు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా అల్లు అర్జున్ అరెస్ట్ పై పర్సనల్ లాయర్ ని సంప్రదించిన అల్లు అరవింద్ దానిపై ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు.

కాగా అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై లంచ్ మోషన్ విచారణ జరపాలని జస్టిస్ జువ్వాడి శ్రీదేవి కోర్టులో మెన్షన్ చేసిన న్యాయవాదులు నిరంజన్ రెడ్డి అశోక్ రెడ్డి. సోమవారం వరకు ఆయనని అరెస్టు చేయకుండా ఆర్దర్స్ ఇవ్వాలని కోరిన న్యాయవాదులు. పోలీసులను అడిగి 2.30కి చెబుతానన్న అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. కాగా దీని విచారణ 2.30కి వాయిదా పడింది. మరి ఈ కేసులో తదుపరి ఏమి జరుగుతుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version