Home సినిమా వార్తలు Sankranthi Competition: తెలుగుతో పాటు తమిళంలో కూడా బాక్సాఫీస్ వద్ద మళ్లీ మ్యాజిక్ చేస్తున్న సినిమాల...

Sankranthi Competition: తెలుగుతో పాటు తమిళంలో కూడా బాక్సాఫీస్ వద్ద మళ్లీ మ్యాజిక్ చేస్తున్న సినిమాల మధ్య పోటీ

ఈ సారి సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు విడుదల కావడంతో పోటీ చాలా ఆసక్తికరంగా మారనుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, దళపతి విజయ్ నటించిన వారిసు, అజిత్ యొక్క తునివు ఈ సంక్రాంతి / పొంగల్ సీజన్ వద్ద పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.

ఆడియో, ట్రైలర్స్, ఇతర ప్రచార కార్యక్రమాల కంటే పోటీ అనేది ఏ సినిమాకు అయినా బజ్ క్రియేట్ చేస్తుంది. సంక్రాంతి 2020లో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలు పోటీ పడటం వల్ల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ సంఖ్యలను సాధించాయి మరియు ఇప్పటికీ ఇవి తెలుగు బాక్సాఫీస్ వద్ద నాన్ ఎస్ఎస్ఆర్ టాప్ 2 తెలుగు గ్రాసర్స్ గా నిలిచాయి. ఇప్పుడు 2023 సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకు కూడా అదే మ్యాజిక్ జరుగుతోంది.

తమిళ చిత్రాలు తునివు మరియు వారిసుకి కూడా సూపర్ బజ్ కలిగి ఉన్నందున అదే పరిస్థతి ఏర్పడింది. దీంతో సంక్రాంతికి విడుదల అవుతున్న అన్ని సినిమాలకు కూడా ఆయా హీరోల గత చిత్రాల కంటే బుకింగ్స్ చాలా బాగున్నాయి.

స్టార్ హీరోల మధ్య పోటీ ఎప్పుడు వచ్చినా ఫ్యాన్స్, ఆడియన్స్ తో పాటు ట్రేడ్ సర్కిల్స్ లో కూడా అది చాలా ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. మరి ఈ ఉత్సాహం ఇలాగే కొనసాగి ఈ నాలుగు సినిమాలు విజయం సాధించి నిర్మాతలకు లాభదాయకంగా నిలవాలని కోరుకుందాం.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version