Home సినిమా వార్తలు Hyper Aadi: ప్రతి ప్రమోషనల్ ఈవెంట్ లో ఓవర్ యాక్షన్ చేస్తున్న కమెడియన్ హైపర్...

Hyper Aadi: ప్రతి ప్రమోషనల్ ఈవెంట్ లో ఓవర్ యాక్షన్ చేస్తున్న కమెడియన్ హైపర్ ఆది

ధనుష్ ‘సార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ హైపర్ ఆది ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన త్రివిక్రమ్ గురించి గొప్పగా మాట్లాడారు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ ల గురించి ఆయన చెప్పిన మాటలు, అసంబద్ధమైన ఎలివేషన్స్ ప్రేక్షకులకు ఓవర్ యాక్షన్ గా అనిపించాయి.

హైపర్ ఆదికి పవన్ కళ్యాణ్ నచ్చితే పర్వాలేదు కానీ వేరే సినిమా ఈవెంట్ లో ఆయన గురించి మాట్లాడటం సమస్యేనని అంటున్నారు నెటిజన్లు. పైన చెప్పినట్టుగానే నిన్న ధనుష్ సర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి తన వ్యక్తిత్వాన్ని ఎలివేట్ చేసారు. ఇక త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ గురించి కూడా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ కు ఈ సినిమాకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి అది అనవసరం అనే చెప్పాలి.

ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ.. ‘మాటలకు మనిషి రూపం వస్తే… అది మట్లాడే మొదటి మాట, థాంక్యూ త్రివిక్రమ్’ అని అంటూ త్రివిక్రమ్ తో పాటు తన అభిమాన హీరో అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల గురించి తన స్పీచ్ ని ఎన్నో పొగడ్తలతో నింపారు.

సాధారణంగా నిర్మాత, నటుడు అయిన బండ్ల గణేష్ సినిమా ఈవెంట్లలో విపరీతమైన వ్యాఖ్యలకు, భజనకు పెట్టింది పేరు. ఇప్పుడు హైపర్ ఆది మరో బండ్ల గణేష్ గా ఎదుగుతున్నాడని అంటున్నారు నెటిజన్లు.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సార్/వాతి’. ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుంది. బుధవారం ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ధనుష్ తెలుగులో మాట్లాడి అందరినీ బాగా ఆకట్టుకున్నారు. అంతే కాకుండా తెలుగులో మాస్టారు మాస్టారు అంటూ పాట పాడి అందరినీ అలరించారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version