టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 డిసెంబర్ 5న గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించగా సుకుమార్ తెరకెక్కించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతమా అందించిన ఈమూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించారు. అయితే ఈ మూవీ యొక్క ప్రీమియర్స్ కోసం డిసెంబర్ 4న హైదరాబాద్ సంధ్య థియేటర్ కి వెళ్లి ప్రత్యేకంగా మూవీ చూసారు అల్లు అర్జున్.
అదే సమయంలో థియేటర్ వద్ద భారీ తొక్కిసలాట జరుగడంతో ఒక మహిళ మృతి చెందడంతో పాటు ఆమె కుమారుడి పరిస్థితి విషమంగా మారింది. అయితే ఈ విశ్యాయమై ఇటీవల అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన పోలీసులు కొద్దిసేపటి క్రితం ఆయనని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇప్పుడే ఆయనకు గాంధీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు పూర్తికాగా ఆయనని నాంపల్లి కోర్టుకు తరలించనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయమై కొద్దిసేపటి క్రితం స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సంధ్య థియేటర్ ఘటన విషయంలో ఒక మహిళ మృతి చెందడం వల్లనే అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసారని, ఇందులో తన జోక్యం ఏమి ఉండదని స్పష్టం చేసారు. అలానే ఈ ఘటన పై చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అందరు దాని ముందు సమానం అని అన్నారు. మరి ఇకపై ఈ కేసు ఏవిధంగా ముందుకు సాగుతుందో చూడాలి.