Home సినిమా వార్తలు 7/G Brindavan Colony: చర్చలలో ఉన్న క్లాసిక్ తమిళ – తెలుగు ద్విభాషా బ్లాక్ బస్టర్...

7/G Brindavan Colony: చర్చలలో ఉన్న క్లాసిక్ తమిళ – తెలుగు ద్విభాషా బ్లాక్ బస్టర్ 7/జి బృందావన్ కాలనీ సీక్వెల్

కొన్నేళ్లుగా తెలుగు, తమిళ భాషల్లో సమానంగా రాణించి రెండు ఇండస్ట్రీల్లో సమాన క్రేజ్ ను సంపాదించుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఆ పలు చిత్రాల్లో 7/జి బృందావన్ కాలనీ సినిమా ఒకటి. మధ్యతరగతి జీవితాన్ని, ఆ కాలంలో యువత పోకడలని అటు జనరంజకంగా ఇటు వాస్తవికంగా చిత్రించడంతో పాటు ఎంతో అద్భుతమైన ఉన్న సంగీతం కారణంగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా క్లాసిక్ కల్ట్ స్టేటస్ సాధించింది.

గత కొన్నేళ్లుగా ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని వార్తలు వస్తుండగా, ఇప్పుడు ఆ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. తొలి భాగాన్ని నిర్మించిన ఏఎం రత్నం ఈ చిత్రాన్ని కూడా నిర్మించనుండగా, సెల్వరాఘవన్ ఏ దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మొదటి భాగంలో హీరోగా చేసిన రవి కృష్ణ మరోసారి ప్రధాన పాత్ర పోషిస్తారట. కాబట్టి ఈ చిత్రం కాలగమనంలో కొన్ని సంవత్సరాల జంప్ ను చూపిస్తుంది. ఇక హీరోయిన్ గా కూడా సోనియా అగర్వాల్ నే మళ్ళీ సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని నిర్మిస్తున్న ఏఎం రత్నం తన ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఈ క్రేజీ సీక్వెల్ ను పరిశీలిస్తారు. త్వరలోనే ఈ సీక్వెల్ పై అధికారిక ప్రకటన రానుందని, ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ తమిళ- తెలుగు ద్విభాషా చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం అందుతోంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version