ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 పై దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ తో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరిలో ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా రావు రమేష్, ఫహాద్ ఫాసిల్, సునీల్, అనసూయ భరద్వాజ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ భారీ పాన్ ఇండియన్ మూవీని ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చివరి దశకు షూటింగ్ చేరుకున్న ఈ మూవీ డిసెంబర్ 6న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అవుతుందంటూ ఇటీవల మేకర్స్ అఫీషియల్ గా డేట్ అనౌన్స్ చేసారు.
విషయం ఏమిటంటే, నేడు ఒక మీడియా కార్యక్రమంలో భాగం నిర్మాత రవిశన్కర్ మాట్లాడుతూ, పుష్ప 2 రిలీజ్ డేట్ విషయంలో అస్సలు తగ్గేదే లేదని, పక్కాగా మూవీని తాము ప్రకటించిన విధంగానే డిసెంబర్ 6న థియేటర్స్ లో ఉంటుందని తెలిపారు. అలానే వినాయకచవితికి మాత్రం ఎటువంటి అప్ డేట్ మాత్రం లేదన్నారు. ఇక నవంబర్ 25 కల్లా ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని తెలిపారు. మొత్తంగా ఈ ప్రకటనతో డిసెంబర్ 6న పక్కాగా పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయం అని తెలుస్తోంది.