టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు, బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ల కలయికలో తెరకెక్కుతున్న తాజాగా భారీ వెబ్ సిరీస్ సిటాడెల్. ఇటీవల హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో రూపొందిన అమెరికన్ సిరీస్ సిటాడెల్ కి ఇది ఇండియన్ రీమేక్.
ఇటీవల సమంతతో ఫామిలీ మ్యాన్ 2 సిరీస్ ని రూపొందించిన దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే దీనిని కూడా భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ నవంబర్ 7 నుండి పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. తాజగా రిలీజ్ అయిన సిటాడెల్ బన్నీ హనీ సిరీస్ యొక్క ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో పాటు భారీ యక్షాన్ థ్రిల్లింగ్ సీన్స్ అందరినీ ఆకట్టుకుని సిరీస్ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.
చూస్తుంటే ఈ సిరీస్ యాక్షన్ నేపథ్యంలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక ఈ సిరీస్ లో కే కే మీనన్, సిమ్రాన్ సాకిబ్ సలీమ్, సికందర్ ఖేర్, సోహమ్ మజుందార్, శివన్‌కిత్ పరిహార్, మరియు కశ్వీ మజ్ముందర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.