అందాల కథానాయక సమంత అలానే బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ల కలయికలో ప్రముఖ అమెరికన్ సిరీస్ సిటాడెల్ కి రీమేక్ గా రూపొందిన ఇండియన్ వెర్షన్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ. ఇటీవల అనౌన్స్మెంట్ పోస్టర్ నుంచి అందరిలో మంచి ఆసక్తి ఏర్పరచిన ఈ సిరీస్ ఆ తరువాత టీజర్, ట్రైలర్ తో అందరిలో మరింత అంచనాలు ఏర్పరిచింది. కాగా నేడు ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఈ సిరీస్ ఆడియన్స్ ముందుకు వచ్చింది.
ప్రముఖ దర్శక ద్వయం రాజ్ డీకే దీనిని గ్రాండ్ లెవెల్ లో తెరకెక్కించారు. ఇది ఈ సిరీస్ అందరి నుంచి మంచి రెస్పాన్స్ అయితే అందుకుంటుందని మేకర్స్ అంటున్నారు. ప్రియాంక చోప్రా ఒరిజినల్ సిటాడెల్ సిరీస్ లో నటించడం జరిగింది. ముఖ్యంగా సిటాడెల్ హనీ బన్నీ సిరీ యొక్క స్టోరీ ప్లాట్ తోపాటు దర్శకులు తెరకెక్కించిన విధానంతో పాటు సమంత, వరుణ్ ధావన్ ల నటన ప్రధానాకర్షణ అంటున్నారు టీమ్ సభ్యులు.
అలానే యాక్షన్ సన్నివేశాలు ఈ సిరీస్ కి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్టు మనకు టీజర్, ట్రైలర్ ని బట్టి చూస్తే తెలుస్తోంది. మరి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సిరీస్ రాబోయే రోజుల్లో ఏ స్థాయిలో ఆడియన్స్ యొక్క రెస్పాన్స్ సంపాదిస్తుందో చూడాలి.