టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.
ఇక ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ అయిన ఫియర్ సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకోగా అనంతరం సెకండ్ సాంగ్ అయిన చుట్టమల్లే అనే పల్లవితో సాగె మెలోడియస్ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఆకట్టుకునే ట్యూన్, లిరిక్స్ తో విజువల్స్ తో రూపొందిన ఈ లిరికల్ వీడియోకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ నుండి కూడా బాగా రెస్పాన్స్ వస్తోంది.
ఇక ఈ సాంగ్ తెలుగు వర్షన్ 73 మిలియన్స్, హిందీ 22 మిలియన్స్, తమిళ్ 5 మిలియన్స్, కన్నడ మరియు మలయాళం 2 మిలియన్స్ తో కలిపి మొత్తంగా ఈ సాంగ్ 104 మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకుని ఇంకా యూట్యూబ్ లో దూసుకెళుతోంది. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన దేవర రిలీజ్ అనంతరం ఎంత మేర విజయం అందుకుంటుందో చూడాలి.