మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈరోజు అభిమానుల భారీ వేడుకలు, ఆనందోత్సాహాల మధ్య విడుదలైంది. దర్శకుడు బాబీ, చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
ఇక ఈరోజు విడుదలైన తొలి షో నుండి మంచి టాక్.. ఇంత గొప్ప స్టార్ కాస్ట్ మరియు పాజిటివ్ బజ్ ఉన్నప్పటికీ, చిరంజీవి యొక్క వాల్తేరు వీరయ్య మొదటి రోజు వీరసింహారెడ్డి సృష్టించిన బాక్సాఫీస్ మ్యాజిక్ కు సరితూగలేకపోయింది.
బాలయ్య ఓపెనింగ్ ప్రభావం చిరు సినిమా పై కూడా కనిపించింది, ఎందుకంటే ఈ చిత్రం ప్రారంభ ప్రదర్శనల ద్వారా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ తుఫానును సృష్టించలేక పోయింది. ఇక ప్రీ రిలీజ్ బజ్ పరంగా ఈ చిత్రం సాధించిన నంబర్లు నిరాశపరిచాయి అనే చెప్పాలి. ఐతే వారాంతంతో పాటు వచ్చే పండుగ రోజులు ఈ సినిమాకి అద్భుతంగా పని చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఆ రకంగా చూసుకుంటే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
బాబీ సింహా, శృతి హాసన్, కేథరిన్, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆచార్య పరాజయం, గాడ్ ఫాదర్ యావరేజ్ పెర్ఫామెన్స్ తర్వాత వాల్తేరు వీరయ్య మెగాస్టార్ ను తిరిగి సక్సెస్ రూట్ లోకి తీసుకు వస్తుందని మెగా అభిమానులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
మరి వారి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన వాల్తేరు వీరయ్య మంచి టాక్ ను ఉపయోగించుకుని బ్లాక్ బస్టర్ గా నిలవాలని కోరుకుందాం.