మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్ అక్టోబర్ 5 న విడుదలైంది, కాగా ఈ చిత్రం మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ యొక్క అధికారిక తెలుగు రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. మాతృకకి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించారు.
చిరంజీవి లూసిఫర్‌ని రీమేక్ చేస్తున్నారని తెలిసిన క్షణం నుంచే, ఈ నిర్ణయం సరైనదేనా కాదా అని చాలా రకాల చర్చలు జరిగాయి. ఈ సినిమా చిరంజీవి ఇమేజ్‌కి సరిపోదని, అనవసరంగా రీమేక్ చేస్తున్నారని కొందరు సోషల్ మీడియాలో అభిప్రాయపడ్డారు.
చిరంజీవి లాంటి స్టార్‌కి అవసరమైన కమర్షియల్ అప్పీల్ లేనందున లూసిఫర్ రీమేక్ అనేది తప్పుడు ఆలోచన అని కొందరు మెగా అభిమానులు కూడా అభిప్రాయపడ్డారు. అయితే, మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికే ముందుకు వెళ్లి ఈ దసరాకి గాడ్ ఫాదర్‌ను విడుదల చేశారు.
గాడ్‌ఫాదర్ ప్రచార కార్యక్రమాల్లో చిరంజీవి మాట్లాడుతూ లూసిఫర్‌లోని కొన్ని భాగాలు తనకు నచ్చలేదని, ఏదో అసంపూర్ణంగా అనిపించిందని, అందుకే మార్పులు చేశానని చెప్పారు. లూసిఫర్ నుండి గాడ్ ఫాదర్ వరకు కొన్ని మార్పులు వచ్చాయి, అది మన తెలుగు ప్రేక్షకులకు సరిపోయేలా ఫ్యామిలీ యాంగిల్‌ని బాగా ఎమోషనల్ చేయడం వంటివి పని చేశాయనే చెప్పాలి.
అయితే మంచి కంటెంట్‌తో పాటు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ గాడ్ ఫాదర్ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు. నిజానికి చాలా ఏరియాల్లో, చిరంజీవి గత సినిమాలైన ఖైదీ నంబర్ 150, సైరా నరసింహ రెడ్డి మొదటి రోజు షేర్ కన్నా గాడ్ ఫాదర్ ఇన్ని రోజుల వరకు కలెక్ట్ చేసిన షేర్ తక్కువ కావడం గమనార్హం. ఇక గాడ్ ఫాదర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా లూసిఫర్ కంటే తక్కువ కలెక్ట్ చేయడం ఆశ్చర్యకరం.
లూసిఫర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ 130 కోట్లకు పైగా వసూలు చేసింది. గాడ్‌ఫాదర్ కేవలం తెలుగులోనే కాక హిందీ భాషలో విడుదలైంది మరియు అన్ని భాషలను కలిపితే కూడా గ్రాస్ 100 కోట్ల కంటే తక్కువగా ఉంటుంది.
సాధారణంగా తెలుగు మార్కెట్ మలయాళ మార్కెట్ కంటే చాలా మైళ్ల దూరంలో ఉంటుంది. అయినా కూడా గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద లూసిఫర్ నంబర్లను బీట్ చేయడంలో విఫలమవడం ట్రేడ్ వర్గాలను విస్మయపరిచింది.