మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యువ దర్శకడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ యాక్షన్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ మూవీ విశ్వంభర. ఈ మూవీని యువి క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ప్రారంభము నాటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు కలిగిన విశ్వంభర మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి టీమ్ గ్రాండ్ గా మ్యూజిక్ సిట్టింగ్స్ ని ప్రారంభించింది. ఈ సందర్భంగా టీమ్ తో కలిసి మెగాస్టార్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం విశ్వంభర పై ఎంతో గట్టిగా దృష్టి పెట్టారట సంగీత దర్శకడు కీరవాణి, అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మూవీలో మొత్తంగా ఐదు సాంగ్స్ తో పాటు బ్యాక్ మ్యూజిక్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండేలా కీరవాణి కసరత్తు చేస్తున్నారని టాక్. మొత్తంగా విశ్వంభర టీమ్ మొత్తం కూడా అవుట్ పుట్ అదిరిపోయేలా శ్రమిస్తున్నట్లు చెప్తున్నారు. కాగా ఈ మూవీ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.