Homeసినిమా వార్తలుVishwambhara Climax Shoot 'విశ్వంభర' క్లైమాక్స్ కోసం భారీ యాక్షన్

Vishwambhara Climax Shoot ‘విశ్వంభర’ క్లైమాక్స్ కోసం భారీ యాక్షన్

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యువి క్రియేషన్స్ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అవుతున్న లేటెస్ట్ భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ఈ మూవీని బింబిసార మూవీ ఫేమ్ మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తుండగా ఆస్కార్ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.

భీమవరం దొరబాబు పాత్రలో మెగాస్టార్ మంచి మాస్ రోల్ చేస్తున్న ఈ మూవీలో ఇషా చావ్లా, మీనాక్షి చౌదరి, సురభి, ఆషిక రంగనాథ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ యొక్క క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరణ తాజాగా ప్రారంభించింది మూవీ యూనిట్.

ఇక ఈ భారీ యాక్షన్ సీన్స్ కోసం ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ అనల్ అరసుని ఎంపిక చేసారు విశ్వంభర టీమ్. ఆయన సారధ్యంలో ఈ క్లైమాక్స్ సీన్స్ అత్యద్భుతంగా సిద్దమవుతున్నాయని అంటున్నారు మేకర్స్. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు మేకర్స్. మరి అందరిలో అందరిలో మంచి క్రేజ్ కలిగిన విశ్వంభర ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

READ  Mahesh Babu సోషల్ మీడియాని షేక్ చేస్తున్న మహేష్ మ్యానియా

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories