Homeసినిమా వార్తలుగాడ్ ఫాదర్ ఒక నిశ్శబ్ద విస్ఫోటనం - మెగాస్టార్ చిరంజీవి

గాడ్ ఫాదర్ ఒక నిశ్శబ్ద విస్ఫోటనం – మెగాస్టార్ చిరంజీవి

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ”గాడ్ ఫాదర్’. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 5న అంగరంగ వైభవంగా రిలీజ్ కు సిద్ధం అవుతుంది. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నా.. సరైన విధంగా ప్రచారం చేయట్లేదు అనే భావన నిన్న మొన్నటి వరకూ మెగా అభిమానుల్లో ఉండింది. అయితే గత వారం నుంచి గాడ్ ఫాదర్ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇటివలే తార్ మార్ తక్కర్ మార్ పాటని విడుదల చేసిన తర్వాత తాజాగా నజబజజజర పాటని కూడా విడుదల చేశారు.

ఇక నిన్న ‘ గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో చిరు స్పీచ్ హైలెట్ గా నిలిచింది. వర్షం వల్ల అంతరాయం కలిగినప్పటికీ చిరంజీవి అభిమానుల కోసం నిలబడి ఇరవై నిమిషాలకు పైగానే మాట్లాడటం విశేషం. ఈ ఈవెంట్ లో ఎప్పటిలాగానే ఆయన సినిమాకు సంబంధించిన అన్ని విషయాల గురించి మాట్లాడారు.

ఆచార్య సినిమా పరాజయం పట్ల తనకు నాకు చాలా బాధగా ఉందని, అయితే గాడ్ ఫాదర్ ప్రేక్షకులని తప్పకుండా ఆకట్టుకుంటుందని, ఈ సినిమా ఒక నిశ్శబ్ద విస్ఫోటనం అని గట్టిగా చెప్పారు. మరియు ఈ సినిమా చేయడానికి రామ్‌చరణ్ ప్రధాన కారణం అని కూడా చెప్పారు, ఈ సినిమా తన ఇమేజ్‌కి సరిపోతుందని చరణ్ సూచించినట్లు చిరంజీవి తెలిపారు.

READ  రెండో వారాంతంలో బాక్స్ ఆఫీస్ వద్ద పుంజుకున్న బ్రహ్మస్త్ర

ఇక సినిమాలో మాతృకతో పోలిస్తే మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశామని ఈ సందర్భంగా చిరంజీవి తెలిపారు. దర్శకుడు మోహన్ రాజా హీరోయిజాన్ని చాలా కొత్తగా చూపించారని ఆయన అన్నారు. ఇక సంగీత దర్శకుడు తమన్ ను అయితే చిరంజీవి ఆకాశానికి ఎత్తేశారు. తమన్ ఈ సినిమాకి ఆరో ప్రాణంగా నిలిచారని, అద్భుతమైన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని చిరంజీవి పొగిడారు.

ఇక ఈవెంట్‌కు చిరంజీవి చాలా ఆలస్యంగా వచ్చారు. వర్షం, ట్రాఫిక్‌ తదితర కారణాల వల్ల ఆయన ఆలస్యమయ్యారు. ఈ విషయం అభిమానులకు అర్థమయ్యేలా చెప్పారు చిరంజీవి. అభిమానులు వర్షంలో తడుస్తూ.. తన కోసం కార్యక్రమంలో ఉంటే.. తాను గొడుగుల కింద నిలబడి మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. ఇండస్ట్రీకి ఏ గాడ్ ఫాదర్ లేకుండా వచ్చానని తన గురించి చెప్తారని, కానీ తన అభిమానులే తనకు గాడ్ ఫాదర్లు అని చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు.

అక్టోబరు 5న దసరా కానుకగా తెలుగులో మూడు సినిమాలు వస్తున్నాయి. ‘గాడ్‌ఫాదర్‌’తోపాటు నాగార్జున ‘ఘోస్ట్’, బెల్లంకొండ గణేష్‌ ‘స్వాతిముత్యం’ కూడా వస్తున్నాయి. చిరంజీవి తన ప్రసంగంలో తన సినిమా గురించి మాత్రమే చెప్పుకోకుండా ‘ఘోస్ట్‌’ సినిమా గురించి కూడా చెప్పారు. తన మిత్రుడు, శ్రేయోభిలాషి అయిన నాగార్జున సినిమా విజయం సాధించాలని ఆయన అన్నారు.

అలాగే ‘స్వాతిముత్యం’ గురించి కూడా ప్రస్తావించారు. పెద్ద సినిమాలతోపాటు చిన్న సినిమాలు కూడా ఆడితేనే ఇండస్ట్రీ బాగుపడుతుంది అంటూ తన మంచితనాన్ని మరోసారి చాటుకున్నారు.

READ  Box-Office: అమీర్ ఖాన్ సినిమా.. అక్కడ హిట్టే

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories