Home సినిమా వార్తలు Chiranjeevi: వరుసగా కొరటాల శివను టార్గెట్ చేస్తూ తనను తాను దిగజార్చుకుంటున్న చిరంజీవి..

Chiranjeevi: వరుసగా కొరటాల శివను టార్గెట్ చేస్తూ తనను తాను దిగజార్చుకుంటున్న చిరంజీవి..

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఆచార్య సినిమా పరాజయం పాలైన తర్వాత చిరంజీవి చాలా సందర్భాల్లో కొరటాల శివ పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. అయితే కొరటాల శివను టార్గెట్ చేసి తాను ఏ వ్యాఖ్యలూ చేయలేదని, అవి సినీ పరిశ్రమకు సంబంధించిన సాధారణ ప్రకటనలని ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

అయితే ఖచ్చితంగా చిరంజీవి వ్యాఖ్యలు కొరటాలను టార్గెట్ చేస్తూ చేసినవేనని ఇతర హీరోల అభిమానులు, సోషల్ మీడియాలోని ఇతర తటస్థ ప్రేక్షకులు గట్టిగా చెబుతున్నారు.

కొరటాల శివను వరుసగా టార్గెట్ చేస్తూ చిరంజీవి సంధిస్తున్న తీరు చూస్తుంటే.. బహుశా ఆయన ఆచార్య ఫలితాన్ని తట్టుకోలేకపోతున్నారని అంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేవి మామూలేనని, కానీ ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం ఎప్పుడూ చూడలేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

కొరటాల మీద కానీ, ఇండస్ట్రీలోని ఇతర దర్శకుల పై కానీ చిరంజీవి చేసిన కామెంట్స్ వెనుక ఖచ్చితమైన కారణం ఏంటో ఎవరికీ తెలియదు. కానీ ఆయన మాటలు నిజంగా కొరటాలకి వ్యతిరేకంగా అని ఉంటే గనక.. ఆయన తన ధోరణి గురించి ఒకసారి ఆలోచించాలి.

ఎందుకంటే కొరటాల శివ ఏమీ మామూలు దర్శకుడు కాదు, నాలుగు విజయవంతమైన చిత్రాలను అందించారు, అలాగే 3 బ్యానర్స్ లో పనిచేశారు, ఏ నిర్మాత కూడా ఆయన గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కానీ, లేదా ఫిర్యాదు కానీ చేయలేదు.

అలాగే, ఆ 4 చిత్రాల నిర్మాతలకు అద్భుతమైన లాభాలు కూడా వచ్చాయి. చిరంజీవి చేసిన ఈ కౌంటర్లకు కొరటాల శివ బదులుగా సరైన పాయింట్లతో స్పందిస్తే అప్పుడు ఆయనకు అవమానం జరిగినట్లు ఉంటుంది అనడంలో సందేహం లేదు. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివల మధ్య ఉన్న సమస్య ఉన్నా అది త్వరగా సెటిల్ అవుతుందని, మరోసారి వీరిద్దరి మధ్య వివాదానికి సంబంధించిన వార్తలు అసలు తలెత్తవని ఆశిద్దాం.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version