మెగాస్టార్ చిరంజీవి ఈ వేసవిలో ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్ర పోషించగా,కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడడమే కాకుండా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.ఈ పరాభవంతో అటు అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.అటు చిరంజీవి కూడా ఈ ఫలితంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. అందుకే తరువాత చేయబోయే సినిమాల తీరుతెన్నులు జాగ్రత్తగా చూసుకునే పనిలో ఉన్నారట. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఒకటి మలయాళం లో మోహన్ లాల్ హీరోగా నటించిన లూసిఫర్ చిత్రానికి రీమేక్ గా వస్తున్న గాడ్ ఫాదర్.. ఈ సినిమాని తమిళ హిట్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా,మరో సినిమా భోళా శంకర్ (తమిళ సూపర్ హిట్ వేదాలం రీమేక్) కి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. మూడో సినిమాకి బాబీ దర్శకుడు కాగా టైటిల్ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.
ఈ మూడు సినిమాల్లో మొదటగా వచ్చేది గాడ్ ఫాదర్. దసరా కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు అన్ని సన్నాహాలు చేస్తున్నారు. మలయాళ వెర్షన్ లో పృథ్వీరాజ్ చేసిన పాత్రను తెలుగులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చేయనున్నారు.
ఇటీవలే ఫస్ట్ లుక్ కి సంభందించిన వివరాలు కూడా వచ్చాయి. అయితే ఈ చిత్రం తాలూకు రషెస్ చూసిన చిరంజీవి,మోహన్ రాజా పనితనాన్ని మెచ్చుకున్నారు అని సమాచారం. సినిమా చాలా బాగా వచ్చిందని,ఖచ్చితంగా సూపర్ హిట్ అయి తనకి కమ్ బ్యాక్ సినిమాగా నిలుస్తుందని చిరంజీవి ధీమాగా ఉన్నారట. మలయాళం వెర్షన్ తో పోలిస్తే తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా కథలో చాలా మార్పులు చేశారట.